మళ్లీ గెలుస్తా సీఎం అవుతా – జగన్
వైజాగ్ నుంచి పాలన సాగిస్తా
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను మళ్లీ గెలుస్తానని , మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని జోష్యం చెప్పారు. ఎన్నికల తర్వాత విశాఖ పట్టణం నుంచే పాలన సాగిస్తానని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు సీఎం.
విశాఖ అభివృద్దికి అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నానని చెప్పారు. తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు కలల్లో తేలి యాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. అబద్దాల పునాదుల మీద మేడలు కట్టడం మానుకోవాలని సూచించారు.
ఇవాళ దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు. కొందరు గత్యంతరం లేక వెళ్లి పోయారని, వారి వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు జగన్ మోహన్ రెడ్డి.
గత ఎన్నికల సందర్బంగా తాము చెప్పిన 100 శాతం హామీలలో ఇప్పటి వరకు 98 శాతం అమలు చేశానని ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలకు ఆమోద యోగ్యమైన పాలన సాగించామని ఇంతకంటే తాను ఇంకేమీ చెప్పలేనంటూ పేర్కొన్నారు.