NEWSTELANGANA

డీఎస్పీ ప్ర‌ణీత్ రావ్ పై వేటు

Share it with your family & friends

గ‌తంలో ఎస్ఐబీలో ప‌ని చేసిన అధికారి

హైద‌రాబాద్ – తెలంగాణ పోలీస్ శాఖ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ప‌లువురిపై బ‌దిలీ వేటు వేసింది. గ‌త కేసీఆర్ స‌ర్కార్ హ‌యాంలో కీల‌క‌మైన ఎస్ఐబీలో డీఎస్పీగా ప‌ని చేసిన ప్ర‌ణీత్ రావ్ ను స‌స్పెండ్ చేసింది. ప్ర‌స్తుతం ఆయ‌న డీజీపీ ఆఫీసులో ప‌ని చేస్తున్నారు. గ‌తంలో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు సంబంధించిన ఫోన్ల‌ను ట్యాపింగ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. దీనిపై అప్ప‌ట్లో ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి కీల‌క కామెంట్స్ చేశారు.

ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం మార‌డంతో కేసీఆర్ కు , ఆయ‌న ప‌రివారానికి మ‌ద్ద‌తుగా నిలిచిన వారంద‌రిపై వేటు వేసేందుకు సిద్ద‌మైంది స‌ర్కార్. ఇక ప్రణీత్ రావ్ పై వేటు ప‌డ‌గా విచిత్రంగా ఏకంగా 40 మంది డీఎస్పీల‌ను బ‌దిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు డీజీపీ ర‌వి గుప్తా.

ఇదిలా ఉండ‌గా కొన్ని రోజుల కింద‌ట ప్ర‌ణీత్ రావును డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఒక పార్ల‌మెంట్ ప‌రిధిలో మూడు లేదా నాలుగేళ్లు ప‌ని చేస్తున్న డీఎస్పీలు, ఇత‌ర అధికారుల‌ను వెంట‌నే బ‌దిలీ చేయాల‌ని ఈసీ ఆదేశించింది.

ఈ మేర‌కు డీఎస్పీల‌ను బ‌దిలీ చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు డీజీపీ ర‌వి గుప్తా.