సాయిబాబా నిర్దోషి – బాంబే కోర్టు
సంచలన తీర్పు చెప్పిన ధర్మాసనం
ముంబై – నిన్నటి దాకా దేశ ద్రోహం పేరుతో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను జైలు పాలు చేశారు. చివరకు బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆయనకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. ఆయన తీవ్రమైన అనారోగ్యం పాలైనా పట్టించు కోలేదు. చివరకు కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. సాయిబాబా దేశంలో పేరు పొందిన ప్రొఫెసర్లలో ఒకడు.
మానవ హక్కుల నేతగా గుర్తింపు పొందారు. ఈ సందర్బంగా ఆయనపై మంగళవారం బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఈ దేశం పట్ల గౌరవం కలిగి ఉన్నాడని, ఆయన దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయలేదని స్పష్టం చేసింది ధర్మాసనం.
బాంబే హైకోర్టు ఉత్కంఠకు తెర దించింది. జీ ఎన్ సాయిబాబా నిర్దోషి అని తేల్చి చెప్పింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా గతంలో గడ్చిరోలి కోర్టు సాయిబాబాను మావోయిస్టులతో సంబంధాల కేసుకు సంబంధించి దోషిగా నిర్దారించింది. ఇందులో భాగంగా ఆయన జైలులో గడుపుతున్నారు.
పోలీసుల సోదాలలో సాయిబాబా నివాసంలో మావోయిస్టు సాహిత్యం లభించిందని ఆరోపిస్తూ అరెస్ట్ చేశారు.