పీఎంకు సీఎం వీడ్కోలు
మీ ఆతిథ్యం అద్భుతం
హైదరాబాద్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల తెలంగాణ టూర్ ముగిసింది. ఈ సందర్బంగా ప్రత్యేక విమానంలో బెగంపేట నుంచి ఒడిస్సాకు ఎన్నికల ప్రచార నిమిత్తం బయలుదేరి వెళ్లారు ప్రధానమంత్రి. అంతకు ముందు మంగళవారం పీఎం నేరుగా సికింద్రాబాద్ లోని అత్యంత ప్రసిద్ది చెందిన ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మ వారికి పూజలు చేశారు.
అక్కడి నుంచి నేరుగా సంగారెడ్డికి వెళ్లారు. బీజేపీ నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏటీఎంగా వాడుకుంటోందంటూ ఫైర్ అయ్యారు.
ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా ప్రధాని గురించి పల్లెత్తు మాట అనక పోవడం విస్తు పోయేలా చేసింది. ఆదిలాబాద్ వేదికగా జరిగిన సభలో ఇద్దరి మధ్య నవ్వులు విరిశాయి. ఆయనను ఘనంగా సన్మానించారు.
తాజాగా బేగంపేటకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రధాన మంత్రి మోదీకి ఘణంగా వీడ్కోలు పలికారు. ఆయన మోదీకి జ్ఞాపికను అందజేశారు. మీరు ఇచ్చిన ఆతిథ్యం అద్భుతంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి.