NEWSTELANGANA

క‌విత‌క్కా ద‌మ్ముంటే దా

Share it with your family & friends

ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ స‌వాల్

హైద‌రాబాద్ – కాంగ్రెస్ ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై నిప్పులు చెరిగారు. ద‌మ్ముంటే జీవో నెంబ‌ర్ 3పై చ‌ర్చ‌కు రావాలంటూ స‌వాల్ విసిరారు. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా వీడియో సందేశంలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఎమ్మెల్సీ.

రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మేనిఫెస్టో లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ వస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తే తాము జాబ్స్ కు సంబంధించి నియామ‌క ప‌త్రాలు అంద‌జేయ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు బ‌ల్మూరి వెంక‌ట్.

త్వ‌ర‌లో ఖాళీగా ఉన్న అన్ని జాబ్స్ ను భ‌ర్తీ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు . ఇచ్చిన హామీలు అమ‌లు చేస్తుంటే క‌విత నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తూ బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు .

గ‌త ప‌దేళ్ల కాలంలో మ‌హిళ‌లు ఇబ్బంది ప‌డ్డా వారి త‌ర‌పున మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధిగా ఒక్క మాట కూడా మాట్లాడ లేద‌న్నారు బ‌ల్మూరి వెంక‌ట్. లీగల్ పాయింట్స్ అంటూ రోస్టర్ విధానాన్ని తెర మీదికి తీసుకు వచ్చి క‌న్ ఫ్యూజ్ చేసేందుకు య‌త్నిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. జీవో నెంబ‌ర్ 3 వ‌ల్ల నిరుద్యోగుల‌కు ఎలాంటి అన్యాయం జ‌ర‌గ‌ద‌న్నారు.