వెలుగులోకి వచ్చిన చీకటి మిత్రులు
ధర్మ సమాజ్ పార్టీ చీఫ్ విశారదన్ మహారాజ్
హైదరాబాద్ – బీఎస్పీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై నిప్పులు చెరిగారు ధర్మ సమాజ్ పార్టీ చీఫ్ డాక్టర్ విశారదన్ మహారాజ్. మంగళవారం ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ముందు నుంచీ ఆర్ఎస్పీని టార్గెట్ చేస్తూ వచ్చారు. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ విడిచిన బాణం ఆర్ఎస్పీ అంటూ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో మంగళవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నట్టుండి కేసీఆర్ తో భేటీ కావడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ముందు నుంచీ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే , దళితుల ఓట్లు చీల్చేందుకే ఆర్ఎస్పీని రాజీనామా చేయించి పార్టీలో జాయిన్ అయ్యేలా చేశాడంటూ కేసీఆర్ ను ఏకి పారేశారు. ప్రజా సమస్యలపై పోరాటం ఒక బూటకమంటూ పేర్కొన్నారు.
ఈ సందర్బంగా కేసీఆర్, ఆర్ఎస్పీ ఇద్దరూ ఒక్కటేనని ఆరోపించారు. ఇప్పుడు అసలు వాస్తవం ఏమిటో తేలి పోయిందన్నారు. ఇద్దరూ చీకటి మిత్రులేనన్న విషయం బట్ట బయలు అయ్యిందని మండిపడ్డారు డాక్టర్ విశారదన్ మహారాజ్.
కేసీఆర్ పై చేసిన యుద్దం ఒక నాటకం, బూటకమని ఇదంతా స్వప్రయోజనాల కోసం చేసిందే తప్పా ఇంకోటి కాదన్నారు \డీఎస్పీ చీఫ్.