మాలో ఎవరూ పోటీ చేయరు
స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తమ కుటుంబం నుంచి ఏ ఒక్కరు ఎన్నికల బరిలో ఉండరంటూ సంచలన ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసే వారికి ఒక్కటే సమాధానం తన పనితీరు మాత్రమేనని పేర్కొన్నారు. గత కొన్ని రోజుల నుంచి తన ఫ్యామిలీకి చెందిన వారు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమని స్పష్టం చేశారు సీఎం.
ఎన్నికల సందర్బంగా తాము ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగు హామీలను అమలు చేశామన్నారు రేవంత్ రెడ్డి. తాము పవర్ లోకి వచ్చాక రోజుకు రెండున్నర కోట్ల ఇసుక ఆదాయం పెరిగిందని చెప్పారు. జీఎస్టీ రూ. 500 కోట్ల ఆదాయం పెరిగిందన్నారు.
సీఏంఆర్ఎఫ్ పై ఇంటర్నల్ ఆడిట్ జరుగుతుందన్నారు.
17 ఎంపీ సీట్లలో 14 సీట్లు తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు సీఎం. తమ పరిపాలన పరంగా రిఫరెండంగా ఎన్నికలలోకి వెళతామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.