NEWSTELANGANA

పాల‌మూరు ఎంపీపై కేసీఆర్ ఫోక‌స్

Share it with your family & friends

మ‌న్నె శ్రీ‌నివాస్ రెడ్డి వైపే మొగ్గు

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెట్టారు. ఆయ‌న ఊహించ‌ని రీతిలో ప‌వ‌ర్ ను కోల్పోయారు. తెలంగాణ ఉద్య‌మ నాయ‌కుడిగా గుర్తింపు పొందిన కేసీఆర్ ఉన్న‌ట్టుండి గాడి త‌ప్పార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. అహంకారం, ఆత్మ గౌర‌వానికి మ‌ధ్య జ‌రిగిన పోరాటంలో చివ‌ర‌కు ఆత్మ గౌర‌వ‌మే నిలిచింది. బీఆర్ఎస్ ఇంటి బాట ప‌ట్టింది. కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్క‌డ కింద ప‌డి ఆస్ప‌త్రి పాలై చివ‌ర‌కు లేచి వ‌చ్చారు.

ప్ర‌స్తుతం తాను వెనుకంజ వేసే ప్ర‌స‌క్తి లేద‌ని, యుద్దానికి సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి స‌మీక్ష చేప‌ట్టారు. ఈ స‌మావేశంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్ తో పాటు ఎంపీ మ‌న్నె శ్రీ‌నివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కేసీఆర్ ప్ర‌సంగించారు.

తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరి పోసింది పాల‌మూరు జిల్లానేన‌ని పేర్కొన్నారు. తాను ఇక్క‌డి నుంచే ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని గుర్తు చేసారు. ఎంతో ఘనంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను పాలమూరులో అమలు చేశామ‌ని చెప్పారు.

పాలమూరు నీటి గోసను తీర్చేందుకు , ఉద్యమ సారధిగా తాను చేసిన పోరాటాలను., నాటినుంచి కరువుకోరల్లో చిక్కుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లాను బిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన విధానాన్ని కేసీఆర్ వివరించారు.

ఇదిలా ఉండ‌గా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గ అభర్ధిగా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ని అధినేత కేసీఆర్ ప్రకటించారు.