స్విగ్గీతో ఐఆర్సీటీసీ ఒప్పందం
రైల్వే శాఖ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ – ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీతో కేంద్ర రైల్వే శాఖ ఒప్పందం చేసుకుంది. దేశ వ్యాప్తంగా రైల్వే శాఖ పెద్ద ఎత్తున రైళ్లను నడుపుతోంది. రోజుకు లక్షలాది మంది దేశమంతటా వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఐటీఆర్సీటీసీ ఆధ్వర్యంలో జర్నీ చేస్తున్న వారికి సేవలు అందిస్తున్నాయి. తిండి పదార్థాలను అందజేస్తున్నాయి. ఆయా రైళ్లలోనే సర్వీస్ అందిస్తోంది. ప్రత్యేకించి నీళ్లు, తిను బండారాలు , అన్ని వస్తువులను విక్రయిస్తున్నాయి.
అయితే తమకు మెరుగైన , నాణ్యవంతమైన టిఫిన్లు, భోజనం అందజేయాలని పలువురు ప్రయాణీకులు పెద్ద ఎత్తున సూచనలు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కూడా చేశారు. ఎప్పుడైతే మోదీ ప్రధానమంత్రిగా కొలువు తీరారో అప్పటి నుంచి రైల్వే శాఖను ప్రైవేట్ పరం చేసే దిశగా చర్యలు చేపట్టారు. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున తప్పు పట్టాయి.
తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ఫుడ్ డెలివరీ చేసేందుకు స్విగ్గీ..ఐఆర్సీటీసీతో చేతులు కలిపింది. ప్రయాణీకులు తమకు ఇష్టమైన రెస్టారెంట్ నుండి ఐఆర్సీటీసీ యాప్ లో పీఎన్ఆర్ నెంబర్ తో ఆర్డర్ చేస్తే రైల్వే స్టేషన్ లలో డెలివరీ చేయబోతున్నారు.
ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద మార్చి 12 నుంచి బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ స్టేషన్ లో ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.