మరోసారి జగనే సీఎం
వైసీపీ నేత ఉమ గెడ్డం
విశాఖపట్టణం – ఏపీలో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి ఢోకా లేదని, తమ పార్టీ చీఫ్ , సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోష్యం చెప్పారు వైసీపీ నాయకురాలు, ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఉమ గెడ్డం .
వై నాట్ 175 నినాదంతో తాము ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళుతున్నామని, తమ బాస్ విజయంపై అనుమానం అక్కర్లేదన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా జిమ్మిక్కులు చేసినా, వ్యూహాలు పన్నినా వర్కవుట్ కాదన్నారు ఉమ గెడ్డం.
తమ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని, గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించేందుకే తాము ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు వైసీపీ నాయకురాలు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతోందన్నారు.
ఇవాళ జగన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవ రత్నాలు పథకాలు ఆదర్శ ప్రాయంగా మారాయని, వాలంటీర్ వ్యవస్థ స్పూర్తి దాయకంగా నిలిచిందని పేర్కొన్నారు ఉమ గెడ్డం. బీజేపీకి అంత సీన్ లేదని పేర్కొన్నారు.