NEWSANDHRA PRADESH

బీసీ డిక్ల‌రేష‌న్ అమ‌లు చేస్తాం

Share it with your family & friends

జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి – తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల కూట‌మి ఆధ్వ‌ర్యంలో ఏపీలో అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. టీడీపీ జ‌య‌హో బీసీ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. బీసీ డిక్ల‌రేష‌న్ ను మ‌న‌స్పూర్తిగా స్వాగ‌తిస్తున్నామ‌ని చెప్పారు.

బీసీలు అన్ని విధాలుగా ఎదగాలనేదే తమ అభిమతం అని, జనసేన-టీడీపీ కూటమి కృషి చేస్తుందని, ప్రభుత్వంలోకి వచ్చాక డిక్లరేషన్ ను అమలు చేస్తామని హామీ ఇచ్చాచ‌రు ప‌వ‌న్ క‌ళ్యాణ్. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏలూరులో బీసీ గర్జన సభ ఏర్పాటు చేసి చాలా హామీలు ఇచ్చారని, కానీ ఏమీ చేయలేదని ఆరోపించారు.

వైఎస్సార్ చేయూత కింద 45 ఏళ్లు నిండిన మహిళలకు 75వేలు అందిస్తామన్నారు, ఈ పథకం అందుకుంటున్న బీసీ మహిళా లబ్దిదారుల్లో చాలా వరకు కోత పడుతోంద‌న్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామ‌ని చెప్పార‌ని కానీ ఇప్పుడు దాని ఊసే లేద‌ని పేర్కొన్నారు.

బడ్జెట్ లో మూడో వంతు బీసీలకేనని మోసం చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. జ‌గ‌న్ రెడ్డిని టార్గెట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.