DEVOTIONAL

శ్రీ‌కాళ‌హ‌స్తిలో భారీ బందోబ‌స్తు

Share it with your family & friends

తిరుప‌తి ఎస్పీ కృష్ణ‌కాంత్ ప‌టేల్

శ్రీ‌కాళ‌హ‌స్తి – శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేసిన‌ట్లు ఎస్పీ కృష్ణ కాంత్ ప‌టేల్. ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ మళ్లింపు ప్ర‌దేశేశాల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు ఎస్పీ.

బందోబ‌స్తులో భాగంగా నాలుగు మాడ వీధులను ప‌రిశీలించారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పి మాట్లాడారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు సుమారు 2 నుండి 3 లక్షల వరకు భక్తులు విచ్చేసే అవకాశం ఉంది, అంచనాలకు తగ్గట్టు 1200 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా పరమైన చర్యలను చేపట్టామ‌న్నారు.

ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీసు అధికారుల సారథ్యంలో ఏర్పాట్లు చేశామన్నారు.
ఆలయ పరిసర ప్రాంతాలలో అవసరమైన ప్రతి చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు ఎస్పీ.

ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సీసీ కెమెరాలను అనుసంధానించి నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, క్యూలైన్లో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక దృష్టి సారించి భక్తులకు ఉత్తమమైన సేవలు అందిస్తామన్నారు.

సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, అదే సమయంలో VIPలకు కూడా తగిన సమయం కేటాయించడం జరిగిందన్నారు.