సీఎంతో జర్మనీ రాయబారి భేటీ
తెలంగాణ..జర్మనీతో సంబంధం
హైదరాబాద్ – జర్మనీ దేశపు రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్ మాన్ మర్యాద పూర్వకంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. తెలంగాణ, జర్మనీ దేశాల మధ్య సంత్ సంబంధాలు కలిగి ఉన్నాయని, వీటిని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు జర్మనీ రాయబారి.
ఈ సందర్బంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున జ్ఞాపికను బహూకరించారు. అనంతరం వివిధ అంశాలకు సంబంధించి ఇరువురు చర్చించారు. ప్రధానంగా విద్య, ఆరోగ్యం, ఉపాధి, టెక్నాలజీ, పరిశ్రమల ఏర్పాటు, విమెన్ ఎంపవర్మెంట్ , యూత్ లో స్కిల్స్ ను పెంపొందించడంపై ఎక్కువగా తమ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
జర్మనీ నుంచి ఔత్సాహికులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు సాదర స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. సర్కార్ పరంగా సహాయ సహకారం అందజేస్తామని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. సీఎం ముందు చూపు, ఇచ్చిన సహకారం తాము మరిచి పోలేమని పేర్కొన్నారు జర్మనీ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్ మాన్.