NEWSANDHRA PRADESH

వైసీపీ అభ్య‌ర్థులు డిక్లేర్

Share it with your family & friends

ప్ర‌క‌టించిన సీఎం జ‌గ‌న్

అమ‌రావ‌తి – ఏపీలో ఎన్నిక‌ల వేళ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు వైసీపీ బాస్ , సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. బుధ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒంగోలు లోక్ స‌భ అభ్య‌ర్థిగా పార్టీ త‌ర‌పున చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డిని ఖ‌రారు చేశారు . ఇదే స‌మ‌యంలో ఎర్ర‌గొండ పాలెం స్థానం నుంచి చంద్ర‌శేఖ‌ర్ కు అవ‌కాశం ఇచ్చారు.

వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. త్వ‌ర‌లో మీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు వ‌చ్చిన స‌మ‌యంలో అంద‌రికీ తిరిగి అభ్య‌ర్థుల‌ను ప‌రిచ‌యం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. త్వ‌ర‌లో రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నిక‌ల‌తో పాటు పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇంకా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేయ‌లేదు.

అయితే దేశంలో ముంద‌స్తుగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌క‌టించింది. ఇక రాష్ట్రానికి వ‌స్తే జ‌గ‌న్ రెడ్డి అన్ని పార్టీల కంటే ముంద‌స్తుగా ప్ర‌చారం ప్రారంభించారు. అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే ప‌నిలో ప‌డ్డారు. అయితే ఊహించ‌ని రీతిలో కొంద‌రికి టికెట్ నిరాక‌రించారు. మ‌రికొంద‌రిని ఆయా సీట్ల‌లో మార్చారు.

ఇదే స‌మ‌యంలో త‌మ‌కు టికెట్లు వ‌స్తాయ‌ని భావించ‌ని అభ్య‌ర్థులు ఉన్న‌ట్టుండి జంప్ అయ్యారు ఇత‌ర పార్టీలోకి. ప్ర‌ధానంగా నారా చంద్ర‌బాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ, జ‌న‌సేన పార్టీలోకి జంప్ అయ్యారు. తాజాగా మంత్రి జ‌య‌రామ్ జంప్ అయ్యారు.