బహుజనులకు బాబు భరోసా
పవర్ లోకి వచ్చాక ప్రయారిటీ
అమరావతి – బహుజనులకు గుడ్ న్యూస్ చెప్పారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో బీసీ సభను ఏర్పాటు చేశారు. వైసీపీ పాలనలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రాక్షస పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. జనం ఆయనను ఇంటికి పంపించేందుకు సిద్దంగా ఉన్నారని జోష్యం చెప్పారు.
తమ కూటమి తప్పనిసరిగా ఏపీలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలు ప్రాణాలు పోగొట్టుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
26 వేల మందిపై అక్రమ కేసులు నమోదు చేశారని ధ్వజమెత్తారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు. ఎస్సీ, ఎస్టీల మాదిరే బీసీలకు కూడా తాము వచ్చాక ప్రత్యేకంగా రక్షణ చట్టాన్ని తీసుకు వస్తామని హామీ ఇచ్చారు . నిధులు , విధులు లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి చేతులు దులుపు కున్నాడంటూ జగన్ పై మండిపడ్డారు.
తాము వచ్చాక బీసీలు కూడా శాసించే స్థాయికి చేరుకుంటామని అన్నారు నారా చంద్రబాబు నాయుడు.