NEWSANDHRA PRADESH

నెర‌వేరిన ద‌శాబ్ద‌ల క‌ల‌

Share it with your family & friends

వెలిగొండ ప్రాజెక్టు స్టార్ట్

ప్ర‌కాశం జిల్లా – వెలిగొండ ప్రాజెక్టు జంట ట‌న్నెళ్ల‌ను ప్రారంభించ‌డంతో ఎన్నో ఏళ్లుగా అప‌రిష్కృతంగా ఉన్న క‌ల నెర‌వేరింద‌ని అన్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి వద్ద పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు జంట టన్నెళ్లను ప్రారంభించారు. పూర్తి అయిన టన్నెల్ పనులను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి.

ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని ప్లోరైడ్‌ ప్రభావిత, మెట్ట ప్రాంతాలైన 30 మండలాల్లో తాగు, సాగు నీరు అందుతుంద‌న్నారు. దీనిని ప్రారంభించే అవ‌కాశం ఇచ్చినందుకు ఆ దేవుడికి సదా రుణపడి ఉంటానని అన్నారు సీఎం.

వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో దివంగ‌త నేత‌, మాజీ సీఎం రాజశేఖరరెడ్డి శంకుస్థాప‌న చేశార‌ని, ఇవాళ ఆయ‌న కొడుకునైన తాను ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి. అందుకే దీనిని జాతికి అంకితం చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు.

ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న మన ప్రభుత్వ హయాంలో పూర్తి చేశామ‌న్నారు. ఇప్పుడు రెండో సొరంగం ప‌నులు కొద్ది రోజుల కిందట‌నే పూర్తి చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. 30 మండలాల్లోని 15.25 లక్షల మందికి తాగు నీరు , 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ద‌క్కుతుంద‌న్నారు.