సీఎంను కలిసిన కోనప్ప
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భేటీ
హైదరాబాద్ – రాష్ట్రంలో ఎన్నికల వేళ చిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది భారత రాష్ట్ర సమితి. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు పలువురు జంప్ అవుతున్నారు. ఇప్పటికే పట్నం సునీతా మహేందర్ రెడ్డి, బీబీ పాటిల్, పోతుగంటి రాములు, పోతుగంటి భరత్ , వెంకటేష్ నేత, ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.
నిన్న ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నట్టుండి సచివాలయంలో ప్రత్యక్షం అయ్యారు. తన నియోజకవర్గానికి నిధులు గనుక మంజూరు చేస్తే ప్రజల ప్రయోజనాల కోసం తాను జంప్ అయ్యేందుకు సిద్దమని ప్రకటించారు. ఈ మేరకు ఈనెల 11న జరిగే ఇళ్ల పథకం కార్యక్రమంలో తాను విధిగా పాల్గొంటానని తెలిపారు.
తాజాగా బుధవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఉన్నట్టుండి సచివాలయంలో కనిపించారు. ఆయన నేరుగా సీఎం వద్దకు వెళ్లారు. ఆయనకు శాలువా కప్పారు. దీంతో తాను కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. మొత్తంగా కాంగ్రెస్ ను ఖాళీ చేస్తానని బీరాలు పలికిన కేటీఆర్ ఉన్నట్టుండి ఆ పార్టీ నుంచే వలసలు పెరగడం ఒకింత విస్తు పోయేలా చేస్తోంది.