దేశంలో మళ్లీ మోదీనే పీఎం
తాజా సర్వేలో క్లీన్ స్వీప్
న్యూఢిల్లీ – త్వరలో దేశ వ్యాప్తంగా జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ సంచలన ఫలితాలు నమోదు చేయబోతున్నాయి. ఈ విషయాన్ని ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఒపినీయన్ పోల్ 2024లో వెల్లడించింది. మొత్తం 545 లోక్ సభ స్థానాలకు గాను ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచు కోబోతోందని తెలిపింది.
మోదీ హవా దెబ్బకు ఏకంగా 378 సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి కేవలం 37 సీట్లు మాత్రమే వస్తాయని సంచలన కామెంట్స్ చేసింది. గతంలో కంటే తక్కువ రాబోతున్నాయని పేర్కొంది సర్వే .
రాష్ట్రాల వారీగా చూస్తే మధ్యప్రదేశ్ లో 29 సీట్లు , గుజరాత్ లో 26 సీట్లు, హర్యానాలో 10, ఢిల్లీలో 7 , రాజస్థాన్ లో 25 , యూపీలో 78 సీట్లు, కర్ణాటకలో ల24 సీట్లు, మహారాష్ట్రలో 35 సీట్లు, కేరళలో 3 సీట్లు బీజేపీ కైవసం చేసుకోబోతోందని దీంతో తిరిగి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ కొలువు తీరనున్నారని వెల్లడించింది.