ఢిల్లీకి పురందేశ్వరి..సోము వీర్రాజు
చంద్రబాబు నాయుడు కూడా
అమరావతి – ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి టీడీపీ, జనసేన పార్టీలు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే బీజేపీ మాత్రం టీడీపీతో కలిసేందుకు మొగ్గు చూపడం లేదు. దీనిపై హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. గతంలో కలిసి పని చేసినా కాషాయానికి డ్యామేజ్ తప్ప ఒరిగింది ఏమీ లేదన్న అభిప్రాయంలో ఆ పార్టీ హైకమాండ్ ఉన్నట్లు సమాచారం.
ఇదంతా పక్కన పెడితే తాజాగా బీజేపీ 545 ఎంపీ సీట్లకు గాను తొలి విడతగా 195 సీట్లను ఖరారు చేసింది. తెలంగాణలో 17 సీట్లకు గాను 9 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ ఇప్పటి దాకా ఏపీకి సంబంధించి ఒక్క సీట్ కూడా ప్రకటించ లేదు.
ఇక ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ చీఫ్ సోము వీర్రాజుతో పాటు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఎట్టకేలకు టీడీపీ ఎన్డీయే గూటికి చేరడం ఖాయమని తేలి పోయింది. ఇందుకు సంబంధించి 9న ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ పొత్తు కన్ ఫర్మ్ అయితే 5 ఎంపీ సీట్లు, 9 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు టాక్.