NEWSTELANGANA

మోదీ నిర్వాకం ఆకునూరి ఆగ్ర‌హం

Share it with your family & friends

ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లు నిర్వీర్యం

హైద‌రాబాద్ – సోష‌ల్ డెమోక్ర‌టిక్ ఫోరం క‌న్వీన‌ర్ ఆకునూరి ముర‌ళి నిప్పులు చెరిగారు. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఉన్న వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేయ‌డ‌మే కాకుండా గంప గుత్త‌గా వ‌న‌రుల‌ను వ్యాపారవేత్త‌లు, కార్పొరేట్ కంపెనీల‌కు ధార‌ద‌త్తం చేశాడ‌ని ఆరోపించారు ఆకునూరి ముర‌ళి.

ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల‌ను నిస్సిగ్గుగా తాము గెలిచేందుకు వాడుకుంటున్న తీరు దారుణ‌మ‌ని పేర్కొన్నారు. బీజేపీ హ‌యాంలోనే ఎల‌క్టోర‌ల్ బాండ్స్ చ‌ట్టాన్ని తీసుకు వ‌చ్చింద‌ని, దీని ద్వారా వేల కోట్ల రూపాయ‌ల‌ను పార్టీ కోసం మ‌ళ్లించేలా ప్లాన్ మోదీ చేశారంటూ ఆరోపించారు ఆకునూరి ముర‌ళి.

దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఎల‌క్టోర‌ల్ బాండ్స్ ను ర‌ద్దు చేస్తూ తీర్పు చెప్పింది. మార్చి 6వ తేదీ లోపు ఎవ‌రెవ‌రు ఏయే పార్టీల‌కు ఎల‌క్టోర‌ల్ బాండ్స్ పేరు మీద డ‌బ్బులు విరాళాలు ఇచ్చారో వాళ్ల జాబితా ఇవ్వాల‌ని ఎస్బీఐని ఆదేశించింది. ఈ మేర‌కు నోటీసు కూడా జారీ చేసింది.

విచిత్రం ఏమిటంటే జాబితా ఇచ్చేందుకు త‌మ‌కు 4 నెల‌ల టైం కావాల‌ని ఎస్బీఐ కోర్టుకు తెల‌ప‌డం మోసం చేయ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ వ‌ద్ద ఆ మాత్రం జాబితా ఎందుకు ఉండ‌ద‌ని ఆకునూరి ముర‌ళి ప్ర‌శ్నించారు.

దీని అర్థం అప్ప‌టి లోగా దేశంలో ఎన్నిక‌లు అయి పోతాయి. బీజేపీకి ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఎస్బీఐ చూస్తోంద‌ని ఆరోపించారు. బీజేపీ నియ‌మించిన వ్య‌క్తినే ఎస్బీఐకి చీఫ్ గా ఉండ‌డం వ‌ల్ల‌నే ఇదంతా జ‌రుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆకునూరి ముర‌ళి.