రేవంత్ కు తెలంగాణ ఆత్మ లేదు
మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్
హైదరాబాద్ – మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తన తండ్రి కేసీఆర్ పై, తమ పార్టీపై తీవ్ర స్థాయిలో నోరు పారేసుకున్న సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎంకు సోయి లేకుండా పోయిందన్నారు. ఓడి పోతామోనన్న భయంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. అచ్చం గుంపు మేస్త్రి లాగా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు.
రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ అన్నది లేదన్నారు. ఈ ప్రాంతపు ప్రజలపై అస్సలు గౌరవం లేదన్నారు కేటీఆర్. తెలంగాణ ఆత్మ గౌరవం సాక్షిగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ పట్ల ప్రేమ లేదని, అస్సలు ఆ మాత్రం కూడా సోయి లేనోడంటూ మండిపడ్డారు.
సీఎంగా రేవంత్ రెడ్డి అనర్హుడంటూ స్పష్టం చేశారు . గోల్ మాల్ గుజరాత్ మోడల్ కు గోల్డెన్ తెలంగాణ మోడల్ కు పోలిక పెట్టడం ఏంటి అంటూ ప్రశ్నించారు కేటీఆర్. ఘనమైన గంగా జెమునా తెహజీబ్ మోడల్ కన్నా మతం పేరుతో చిచ్చు పెట్టే గోద్రా అల్లర్ల మోడల్ నచ్చిందా అంటూ ప్రశ్నించారు కేటీఆర్.
నమ్మి ఓట్లేసిన పాపానికి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని మోదీ ముందు మోకరిల్లేలా చేస్తావా అంటూ నిలదీశారు. ఆనాడు తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎక్కు పెట్టావని ఇవాళ ఆత్మ గౌరవంపై దెబ్బ కొడుతున్నావంటూ మండిపడ్డారు కేటీఆర్.