ఖాకీల నిర్వాకం నాదెండ్ల ఆగ్రహం
జనసేన ఆఫీసు సిబ్బందిపై సోదాలు
మంగళగిరి – జనసేన పార్టీ ఆఫీసులో పని చేస్తున్న సిబ్బందికి చెందిన ఇళ్లల్లో అర్ధరాత్రి ఖాకీలు హల్ చల్ చేయడాన్ని, సోదాలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. అధికారం ఉంది కదా అని జగన్ మోహన్ రెడ్డి రెచ్చి పోతున్నాడని , దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని డిమాండ్ చేశారు.
త్వరలో దిగి పోవడం ఖాయమని, తట్టుకోలేక ఇలా దాడులు చేయమని ప్రోత్సహిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు నాదెండ్ల మనోహర్. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలోనైనా పని చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఇది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని , తెలుసుకుంటే మంచిదన్నారు.
రాష్ట్రంలో రాజారెడ్డి రాచరిక పాలన సాగుతోందని, దీనికి ప్రజలు త్వరలోనే చరమ గీతం పాడ బోతున్నారంటూ హెచ్చరించారు. ఎక్కువ కాలం జగన్ రెడ్డి సీఎంగా ఉండడం దండగ అన్న అభిప్రాయానికి వచ్చేశారని పేర్కొన్నారు. ఏం తప్పు చేశారని వైసీపీ నేతలపై కేసులు బనాయిస్తారంటూ నిలదీశారు.