బాబు..పవన్ చెప్పేవన్నీ అబద్దాలే
వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కామెంట్
అమరావతి – రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ పనికిరాని నేతలంటూ ఎద్దేవా చేశారు. ఎంపీ మీడియాతో మాట్లాడారు. మీ మాయ మాటలు నమ్మేందుకు బీసీలు అమాయకులు కాదన్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదన్నారు.
బీసీల కోసం ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు ఎంపీ భరత్. పది మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత తమ నాయకుడు జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు. వివిధ పథకాల కింద బీసీలకు రూ. 1.75 లక్షల కోట్లు జమ చేశారని తెలిపారు.
బాబు ఐదేళ్ల కాలంలో ఏపీలో బీసీలకు ఇచ్చింది కేవలం రూ. 19 వేల కోట్లేనని ఎద్దేవా చేశారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కిన పెత్తందారీ చంద్ర బాబు అంటూ మండిపడ్డారు ఎంపీ భరత్. తమకు న్యాయం చేసిన జగన్ రెడ్డి వెంటే బీసీలు ఉన్నారని చెప్పారు.
ఈసారి కూడా వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు ఎంపీ భరత్.