NEWSANDHRA PRADESH

ఏపీలో టీడీపీ..జ‌న‌సేన హ‌వా

Share it with your family & friends

ఐ ప్యాక్ సంచ‌ల‌న స‌ర్వేలో వెల్ల‌డి

అమ‌రావ‌తి – ఐ ప్యాక్ ఫౌండ‌ర్ , రాజ‌కీయ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అత్య‌ధికంగా సీట్ల‌ను టీడీపీ, జ‌న‌సేన కూట‌మి చేజిక్కించు కోనుంద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

ఆయా ఎంపీ సీట్ల‌కు సంబంధించి ఏయే పార్టీలు కైవ‌సం చేసుకుంటాయ‌నే దానిపై వివ‌రాలు వెల్ల‌డించారు. అర‌కు స్థానంలో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంద‌ని, శ్రీ‌కాకుళంలో టీడీపీ , విజ‌య‌న‌గ‌రంలో మాత్రం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉంటుంద‌ని పేర్కొంది.

విశాఖ‌ప‌ట్నం లోక్ స‌భ ఎంపీ సీటులో టీడీపీ గెలువ బోతోంద‌ని, అన‌కాప‌ల్లిలో టీడీపీ, కాకినాడ‌లో టీడీపీ, అమ‌లాపురంలో టీడీపీ, రాజ‌మండ్రిలో బీజేపీ, న‌ర‌సాపురంలో జ‌న‌సేన‌, ఏలూరులో టీడీపీ, మ‌చిలీప‌ట్నంలో జ‌న‌సేన , విజ‌య‌వాడ‌లో బీజేపీ, గుంటూరులో టీడీపీ, న‌ర‌సారావుపేట‌లో టీడీపీ, బాప‌ట్ల‌లో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంద‌ని ఐ ప్యాక్ వెల్ల‌డించింది.

ఇక ఒంగోలు ఎంపీ స్థానంలో టీడీపీ, నంద్యాల‌లో టీడీపీ, క‌ర్నూల్ లో టీడీపీ, అనంత‌పురం ఎంపీ స్థానంలో టీడీపీ, హిందూపురంలో తెలుగుదేశం పార్టీ, క‌డ‌ప‌లో వైసీపీ , నెల్లూరులో టీడీపీ, తిరుప‌తి లో వైసీపీ , రాజంపేట‌లో బీజేపీ, చిత్తూరు ఎంపీ స్థానంలో టీడీపీ గెల‌వ బోతోంద‌ని పేర్కొంది.