బాబు కంటే జగన్ బెటర్
ఎంపీ కేశినేని నాని కామెంట్స్
విజయవాడ – చంద్రబాబు నాయుడు కంటే జగన్ మోహన్ రెడ్డి ఉన్నతమైన నాయకుడని కొనియాడారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు, పవన్ కళ్యాణ్ మాటలు జనం నమ్మే స్థితిలో లేరన్నారు. నవ రత్నాలు పేరుతో వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ పార్టీని గట్టెక్కిస్తాయని, తిరిగి ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని జోష్యం చెప్పారు కేశి నేని నాని.
కుట్రలు, కుతంత్రాలకు పెట్టింది పేరు చంద్రబాబు అని ఆరోపించారు. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు పగటి కలలు కంటున్నారని, పీకే మాటలు సత్య దూరమని, తిరిగి వైసీపీ పవర్ లోకి వస్తుందన్నారు. జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే విశాఖ రాజధానిగా పాలన కొనసాగిస్తారని చెప్పారు విజయవాడ ఎంపీ.
ఈ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు కంటే జగన్ రెడ్డి 20 రెట్లు ఉద్యోగాలు ఇచ్చాడని, ఈ విషయంలో తాను ఛాలెంజ్ చేస్తున్నానని దమ్ముంటే టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఎవరైనా తనతో చర్చకు రావాలని అన్నారు ఎంపీ కేశినేని నాని.