NEWSTELANGANA

రేవంత్ రెడ్డి డ్రామాలు ఆపు

Share it with your family & friends

బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ ఫైర్

హైద‌రాబాద్ – బ‌హుజ‌న్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న దూకుడు పెంచారు. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. మాట‌లు త‌ప్ప చేత‌లు లేవంటూ పేర్కొన్నారు. పాల‌నా ప‌రంగా ఫెయిల్ అయ్యారంటూ ఆరోపించారు.

ప్ర‌త్యేకంగా జాబ్స్ భ‌ర్తీకి సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉల్లంఘించకుండా, సర్వీసు రూల్సును మార్చకుండా, డిసెండింగ్ ఆర్డర్లో రిక్రూట్ చేస్తే ఇప్పటికీ 3000 బ్యాక్ లాగ్ పోస్టులను నివారించవచ్చ‌ని తెలిపారు. ప్రతి పోస్టుకు 5 రోజుల వ్వవధితో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి , తర్వాత కింది పోస్టుకు వెళ్లడం కామన్ సెన్స్ అని పేర్కొన్నారు.

నిజంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నది గుండెలో ఉంటే సరిగ్గా ఇదే జరిగేదని అన్నారు ఆర్ఎస్పీ. కాని ఎలక్షన్లు, ఎల్బీ స్టేడియం డ్రామానే లక్ష్యం గా పనిచేస్తే నిరుద్యోగులు బజారులో పడతూనే ఉంటారని హెచ్చ‌రించారు. వీళ్ల‌ను మ‌ళ్లీ ఎప్పుడు భ‌ర్తీ చేస్తారంటూ ప్ర‌శ్నించారు.

రాజ‌కీయాలు చేయ‌డానికే టైం స‌రిపోవ‌డం లేద‌ని ఇక ప‌రిపాల‌న ఎలా సాగిస్తారంటూ నిల‌దీశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. మీరు వెంట‌నే గ‌ద్దె దిగితే తాము పాల‌న సాగిస్తామ‌ని ప్ర‌క‌టించారు.