సీఎంకు సోయి లేదు – కేటీఆర్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. గురువారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
వాపు చూసి బలుపు అనుకుంటున్నారంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. తాజాగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా కొనసాగడం ఖాయమని జోష్యం చెప్పారు. ఆరు గ్యారెంటీల పేరుతో జనం చెవుల్లో పూలు పెట్టారంటూ ఎద్దేవా చేశారు.
పాలనా పరంగా రేవంత్ రెడ్డి విఫలం అయ్యారని, దానిని కప్పి పుచ్చుకునేందుకే తన తండ్రి కేసీఆర్ , తనను , తన ఫ్యామిలీని, పార్టీని టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు. ఆరు నూరైనా కేసీఆర్ తెలంగాణ తీసుకు వచ్చిన నాయకుడిగా గుర్తుండి పోతారని అన్నారు.
మోసం చేయడం కాంగ్రెస్ నైజం అని ఎద్దేవా చేశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు కేటీఆర్.