తెలంగాణ డిస్కంలు రికార్డ్
అత్యధికంగా విద్యుత్ సరఫరా
హైదరాబాద్ – అసలే ఎండా కాలం కావడంతో తెలంగాణలో విద్యుత్ వినియోగం అధికంగా పెరిగింది. మరో వైపు భూగర్భ జలాలు అడుగుంటి పోతున్నాయి. ఓ వైపు కాంగ్రెస్ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే నగరంలో వాటర్ ట్యాంకులు ఎక్కడ పడితే అక్కడ దర్శనం ఇస్తున్నాయి. ఒక్క వాటర్ ట్యాంక్ కు రూ. 2,000 నుంచి రూ. 3,000 దాకా పలుకుతోంది. ఈ తరుణంలో ఓ వైపు నీటికి కటకటగా ఉంటే మరో వైపు విద్యుత్ వాడకం గణనీయంగా పెరిగింది.
ఇదిలా ఉండగా తెలంగాణ డిస్కంలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రెండు డిస్కంలు అరుదైన రికార్డును నమోదు చేశాయి. ఈ విషయాన్ని రాష్ట్ర సర్కార్ ప్రత్యేకంగా తెలిపింది.
తెలంగాణ డిస్కింల పరిధిలో ఈనెల 6న 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను సరఫరా చేశాయి. అయితే గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా రికార్డు గా ఉండేది. ప్రస్తుతం గతంలో నమోదైన రికార్డును తిరగ రాశాయి తెలంగాణ డిస్కంలు.
బుధవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా 298.19 MU విద్యుత్ సరఫరా చేసి గత రికార్డును అధిగమించింది.
ఫిబ్రవరి, మార్చి నెలల్లో అత్యధిక డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్ సంస్థలు దానికి తగిన విధంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశాయి.