ఖాకీల తీరుపై కళ్యాణ్ కన్నెర్ర
సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ అనుసరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన సిబ్బంది ఇళ్లల్లోకి ఎలాంటి ముందస్తు సమాచారం (సెర్చ్ వారెంట్ ) లేకుండా ఖాకీలు సోదాలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
తమను ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్లను గుర్తు పెట్టుకుంటామని, తాము పవర్ లోకి వచ్చాక వారి సంగతి చూస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అధికారంలో ఇవాళ జగన్ రెడ్డి ఉన్నాడని రేపు తాము వస్తామని అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా మీ విధులు సక్రమంగా నిర్వర్తించాలని కానీ వైసీపీకి నమ్మిన బంట్లుగా, అనధికారిక కార్యకర్తలుగా పని చేస్తే ఎలా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. జగన్ రెడ్డి కావాలని తమను టార్గెట్ చేశాడని, కానీ తాను లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు.
రాజకీయాలు చేయడంలో తప్పు లేదని కానీ వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదన్నారు.