NEWSTELANGANA

ఎర్ర‌బెల్లికి షాక్ నేత‌లు జంప్

Share it with your family & friends

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిక

పాల‌కుర్తి – మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. నిన్న‌టి దాకా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చిన ఎర్ర‌బెల్లికి తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి ఎదురైంది. ఇదే స‌మ‌యంలో త్వ‌ర‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు రానున్నాయి.

విచిత్రం ఏమిటంటే త‌న‌కు అనుంగు అనుచ‌రులుగా ఉన్న నేత‌లంతా జంప్ జిలానీలుగా మారి పోయారు. ఎర్ర‌బెల్లి ఒంటెద్దు పోక‌డ‌, అహంకారాన్ని త‌ట్టుకోలేక బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఎర్ర‌బెల్లికి రాం రాం అంటూ ఎద్దేవా చేశారు.

ఎంపీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా త‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచి భారీ ఎత్తున ఓట్లు సాధించాల‌నే ల‌క్ష్యంతో పావులు క‌దుపుతున్నారు యువ నాయ‌కురాలు, పాల‌కుర్తి ఎమ్మెల్యే య‌శ‌స్విని రెడ్డి. బీఆర్ఎస్ ను ఖాళీ చేసే ప‌నిలో నిమ‌గ్నం అయ్యారు అత్తా కోడ‌ళ్లు ఝాన్సీ రెడ్డి, య‌శ‌స్విని రెడ్డి. వారి ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యింది.

ఇదిలా ఉండ‌గా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన తొర్రురు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు సభ్యులు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఎవరు అధైర్య పడొద్దు అందరికి అండగా ఉంటాం.. పాలకుర్తి గడ్డ.. కాంగ్రెస్ అడ్డ.. అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమ‌లు చేస్తామ‌న్నారు.