సెర్చ్ వారెంట్ లేకుండానే సోదాలు
నిప్పులు చెరిగిన నాదెండ్ల మనోహర్
మంగళగిరి – జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ అనుసరిస్తున్న ధోరణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులను టార్గెట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ఒకవేళ ఏదైనా అనుమానం ఉంటే ముందస్తుగా చట్ట ప్రకారం సెర్చ్ వారెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నారు నాదెండ్ల మనోహర్. కానీ ఏపీ ఖాకీలు చట్టాన్ని ఉల్లంఘించారని, వారెంట్ లేకుండానే వారి ఇళ్లల్లోకి అర్ధరాత్రి జొరబడ్డారంటూ ధ్వజమెత్తారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు .
రాష్ట్రంలో జగన్ రెడ్డి తానే సుప్రీం అనుకుంటున్నాడని, ఇది మంచి పద్దతి కాదన్నారు. రాబోయే రోజుల్లో తాము కూడా పవర్ లోకి వస్తామని, కానీ ప్రతీకార చర్యలకు పాల్పడే మనస్తత్వం తమకు ఉండదన్నారు నాదెండ్ల మనోహర్.
గోడలు దూకడం, తుపాకులతో బెదిరించడం, తనిఖీలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.