ప్రజల కోసమే పొత్తు పెట్టుకున్నాం
వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు
హైదరాబాద్ – బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీతో పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. తనను టార్గెట్ చేస్తూ కొందరు నాయకులు పదే పదే ప్రస్తావిస్తూ విమర్శలు చేయడాన్ని తప్పు పట్టారు. ఇప్పుడు తనను విమర్శిస్తున్న వారు తాము ఏ పదవిలో ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో చూసుకుని చేయాలని సూచించారు.
బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు, మాజీ సీఎం కుమారి మాయావతి సూచనల మేరకే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. ప్రజలను తప్పు దోవ పట్టించి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అరచేతిలో స్వర్గం చూపించి మోసం చేసిందని ఫైర్ అయ్యారు. పవర్ లోకి వచ్చిన 100 రోజుల్లో లోపే అన్నింటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు వాటి ఊసెత్తడం లేదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
బిసి జనాభ గణన అన్నారు కాని అది కాగితాలకే పరిమితం అయ్యింది తెలంగాణలో
👉అందుకే తెలంగాణ రాష్ట్ర బహుజనుల కోసం,ప్రజల ప్రయోజనాల కోసం,సేక్యూలర్ తెలంగాణ కోసం బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నాం.
- RSP