DEVOTIONAL

ఘ‌నంగా శ్రీ‌వారి ర‌థోత్స‌వం

Share it with your family & friends

అంగ‌రంగ వైభవంగా చ‌క్ర‌స్నానం

తిరుప‌తి – శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ర‌థాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఉదయం 8 నుండి 9 గంటల వ‌ర‌కు శ్రీ భూ స‌మేత క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.

శ్రీ‌వారి రథాన్ని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చ‌కులు తెలిపారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ ఆఖ‌రి రోజు కావ‌డంతో స్వామి వారికి సంబంధించి చ‌క్ర‌స్నానం వైభ‌వంగా జ‌రిగింది. వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.