ఎలక్టోరల్ బాండ్లు బయట పెట్టాలి
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
విజయవాడ – కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం పక్కా మోసమని ఆరోపించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. శుక్రవారం ఏఐసీసీ పిలుపు మేరకు విజయవాడ లోని గాంధీ నగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వైఎస్ షర్మిలా రెడ్డి ప్రసంగించారు.
ఎలక్టోరల్ బాండ్లను తక్షణమే నిలిపి వేయాలని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని సాక్షాత్తు భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వెంటనే మార్చి 6 లోగా ఎవరెవరు ఎలక్టోరల్ బాండ్ల రూపేణా ఆయా పార్టీలకు డబ్బులు ఇచ్చారో వెల్లడించాలని, ఆ జాబితా వివరాలు వెంటనే తమకు అందజేయాలని ఆదేశించిందన్నారు.
విచిత్రం ఏమిటంటే తమకు నాలుగు నెలల సమయం కావాలని ఎస్బీఐ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ విధానం సక్రమం కాదు…అక్రమమన్నారు. ఇది బీజేపీ చేస్తున్న క్విడ్ ప్రోకో. అక్రమ మార్గంలో డబ్బు కోసమే ఈ పథకమన్నారు షర్మిల.
ప్రజల బ్యాంక్‌గా ఉండాల్సిన ఎస్బీఐ మాత్రం మోదీ బ్యాంకుగా వ్యవహరిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు . బాండ్స్ వివరాలు మొత్తం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బాండ్స్ బయటకు వస్తే బీజేపీ ఇరుక్కుంటుంది అని భయ పడుతోందన్నారు.