నిరుద్యోగులు నిరాశ చెందకండి
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సూచన
హైదరాబాద్ – రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కట్టుబడి ఉంటుందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ . శుక్రవారం హైదరాబాద్ లోని సిటీ లైబ్రరీకి వెళ్లారు. అక్కడ ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులతో సంభాషించారు. ఉద్యోగాలను పూర్తి పారదర్శకంగా భర్తీ చేయడం జరుగుతుందన్నారు. మీరు ఎవరూ నిరాశ చెందవద్దని కోరారు.
ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి తో ఉందన్నారు బల్మూరి వెంకట్. గురుకుల ఉద్యోగాల్లో ఉన్న సమస్య, గవర్నమెంట్ స్కూల్స్ లో పీటీ ,ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నియామకాలు, అలాగే గ్రూప్ 2 & 3 లో పెంచాల్సిన పోస్ట్ ల పై, జీవో నెంబర్ 46 పై సీఎం దగ్గరికి కొందరిని తీసుకొని వెళ్తానని చెప్పారు.
సమస్య పై అవగాహన ఉన్న విద్యార్థులను, సమస్య పై పట్టు ఉన్న లెక్చరర్స్ ,అడ్వొకేట్ లతో కలిసి వారి సూచనలు సలహాలు తీసుకుంటామన్నారు. నిరుద్యోగుల కోసం , వారి సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికైనా, ఎందాకైనా వస్తానని హామీ ఇచ్చారు.
ఒక్కసారి ఆలోచించండి ధర్నాలు, దీక్షలు చేసుకుంటూనే ఉందామా లేక సమస్యలను పరిష్కరించుకొని కొలువులు సాధిద్దామా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ.