హైకోర్టు సంచలన తీర్పు
చంద్రబాబుకు బిగ్ షాక్
హైదరాబాద్ – టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. రూ. 50 వేల కోట్ల రూపాయల విలువైన 800 ఎకరాల భూములను ఫేక్ కంపెనీకి కట్టబెట్టాలని ఆనాడు ప్రయత్నం చేశాడు. ఆ కంపెనీ ఐఎంజీ. ఆ భూములన్నీ ప్రభుత్వానివేనని స్పష్టం చేసింది.
విచిత్రం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కాలంలో 2003లో ఐఎంజీ భారత్ కంపెనీకి రూ. 50 వేల చొప్పున ఎకరాలను కేటాయించాడు. ప్రస్తుతం ఆ పొలాలన్నీ సర్కార్ కు చెందినవేనని పేర్కొంది. ఆనాడు భూముల కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్సార్ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది.
ఇక ఐఎంజీ భారత్ అనే కంపెనీని ఆగస్టు 5న 2003లో రిజిష్టర్ చేశారు. దానికి చీఫ్ అహూబలరావు అలియాసస్ బిల్లీ రావు. ఆనాడు క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తామని, ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్దం చేస్తామంటూ సదరు కంపెనీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆ వెంటనే మనోడు ఒప్పందం చేసుకున్నాడు .
ఇదిలా ఉండగా సదరు కంపెనీకి రంగారెడ్డి జిల్లా శేరి లింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్శటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో ఎయిర్ పోర్ట్ కు అత్యంత దగ్గరలో ఉన్న 450 ఎకరాలను ఐఎంజీ కంపెనీకి కేటాయించారు చంద్రబాబు. ఆనాడు ఎకరం ధర రూ. 10 కోట్లు పలికితే మనోడు కేవలం రూ. 50 వేలకే కట్టబెట్టారు.
ఉమ్మడి ఏపీలో టీడీపీ సర్కార్ ఓడి పోయింది..కాంగ్రెస్ రాగానే విచారణ చేపట్టింది. బాబు నిర్ణయాన్ని వ్యతిరేకించింది. భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ ఐఎంజీ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింద.ఇ ఆనాటి నుంచి నేటి దాకా ఆ భూములపై స్టేటస్ కో కొనసాగింది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తప్పని హైకోర్టు తేల్చింది.