NEWSANDHRA PRADESH

వాళ్ల‌కు హాని జ‌రిగితే జ‌గ‌న్ దే బాధ్య‌త

Share it with your family & friends

టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు య‌న‌మ‌ల‌

విజయవాడ : ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు య‌న‌మల రామ‌కృష్ణుడు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సొంత చెల్లెలిచే స‌మాధానం చెప్ప‌లేని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఏం స‌మాధానం చెబుతారంటూ ప్ర‌శ్నించారు య‌న‌మల రామ‌కృష్ణుడు.

త‌ల్లి విజయమ్మ, సోద‌రీమ‌ణులు షర్మిల, సునీతకు ఏ హాని జరిగినా దానికి జగన్ మోహ‌న్ రెడ్డినే పూర్తిగా బాధ్య‌త వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. సొంత బాబాయిని చంపిన అబ్బాయికి తల్లి, చెల్లి ఓ లెక్కా అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ రెడ్డి పాపం పండింది. అధికారం కోసం ఆయన చేసిన పాపాలే నేడు శాపాలుగా మారాయ‌ని అన్నారు. జగన్‌ 420 అని నిన్న వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు అతడి నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయ‌ని ఎద్దేవా చేశారు.

పులివెందులలో సొంత చెల్లెలు సునీతారెడ్డి సభ పెట్టు కోవడానికి కూడా అనుమతి ఇవ్వక పోవడం మహిళలను అవమానించడం కాదా అని నిల‌దీశారు. సొంత కుటుంబ సభ్యుల నమ్మకమే పొందలేని జగన్ రెడ్డి ప్రజల్ని ఏ విధంగా ఉద్ధరిస్తారని ప్ర‌శ్నించారు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు.