NEWSNATIONAL

కేటీఆర్ కు మద్రాస్ ఐఐటీ ఆహ్వానం

Share it with your family & friends

కీల‌క ప్ర‌సంగం చేయాల‌ని ఇన్విటేష‌న్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. ఆయ‌న గ‌తంలో ఎన్నో స‌మ్మిట్ ల‌లో పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రిగా త‌న‌దైన ముద్ర వేశారు. కానీ ప‌వ‌ర్ లో లేకుండా పోయారు. అయినా త‌న హ‌వా త‌గ్గ‌లేదు అని చెప్పేందుకే తాజాగా ఆయ‌న అందుకున్న ఆహ్వానం. అదేమిటంటే దేశంలోనే అత్యున్న‌త‌మైన సంస్థ‌గా ఐఐటీ మద్రాస్ కు పేరుంది.

స‌ద‌రు విద్యా సంస్థ మాజీ మంత్రి కేటీఆర్ కు ఇన్విటేష‌న్ పంపింది. ప్ర‌తి ఏటా నిర్వ‌హించి ఈ స‌మ్మిట్ నిర్వ‌హిస్తూ వ‌స్తోంది ఐఐటీ మ‌ద్రాస్. ఇందులో పాల్గొనేందుకు రావాల‌ని కోరుతూ ఆహ్వానం పంపింది కేటీఆర్ కు. కీల‌క ఉప‌న్యాసం చేయాల‌ని కోరింది.

ఈ సంద‌ర్బంగా మ‌రోసారి వైర‌ల్ గా మారారు కేటీఆర్. ఆయ‌నకు ఐటీ ప‌రంగా మంచి ప‌ట్టుంది. ఆంగ్ల భాష‌పై మోజు కూడా ఉన్న‌త‌మైన విద్యాధికుడిగా మారేలా చేసింది. గ‌తంలో యుఎస్ లో ఉంటూ జాబ్ చేశారు. రాజ‌కీయాల‌లోకి వ‌చ్చారు. తండ్రి చాటు బిడ్డ‌గా కాకుండా త‌నకంటూ ఓ ఇమేజ్ స్వంతం చేసుకున్నారు కేటీఆర్.