NEWSANDHRA PRADESH

అమిత్ షాతో బాబు..ప‌వ‌న్ భేటీ

Share it with your family & friends

పొత్తుల‌పై చ‌ర్చోప చ‌ర్చ‌లు

న్యూఢిల్లీ – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో భేటీ అయ్యారు టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. టీడీపీ, జ‌న‌సే, భార‌తీయ జ‌న‌తా పార్టీకి సంబంధించిన పొత్తుల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇప్ప‌టికే సీట్ల స‌ర్దుబాటుపై ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చారు బాబు, ప‌వ‌న్.

రాష్ట్రంలో మొత్తం 175 శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా 25 లోక్ స‌భ స్థానాలు ఉన్నాయి. అటు అసెంబ్లీ ఇటు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి ఏయే పార్టీకి ఎన్నెన్ని సీట్లు కేటాయించాల‌నే దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయి ఆయా పార్టీలు.

ఇప్ప‌టికే భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి తో పాటు మాజీ చీఫ్ సోము వీర్రాజు కూడా ఢిల్లీలోనే మ‌కాం వేశారు. సీట్ల స‌ర్దుబాబు విష‌యంపై గ‌త కొంత కాలం నుంచీ పురంధేశ్వ‌రి ఒకే మాట చెబుతూ వ‌స్తున్నారు.

పొత్తుల‌పై ఇంకా క్లారిటీ రాలేద‌ని, దీని విష‌యంపై తుది నిర్ణ‌యం పార్టీ హైక‌మాండ్ దేనంటూ స్ప‌ష్టం చేశారు. ఇందులో భాగంగానే చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, పురంధేశ్వ‌రితో అమిత్ షా భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

విచిత్రం ఏమిటంటే ఏపీ రాజ‌కీయాల వ‌ర‌కు చూస్తే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని వైసీపీ బీజేపీకి మోక‌రిల్లింది. ఇక వైసీపీతో పాటు టీడీపీ, జ‌న‌సేన సైతం సాగిల‌ప‌డ‌డం విశేషం. మొత్తంగా ఆయా పార్టీల కూట‌మికి ఎవ‌రికి ఓటు వేసినా అది బీజేపీకి వేసిన‌ట్టేన‌ని అంటోంది ఏపీ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌.

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ భేటీ.. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చ