NEWSTELANGANA

సీఎంను క‌లిసిన క‌ర్ణాట‌క మంత్రి

Share it with your family & friends

జ‌మీర్ అహ్మ‌ద్ తో కీల‌క భేటీ

హైద‌రాబాద్ – క‌ర్ణాట‌క రాష్ట్ర మైనార్టీ సంక్షేమం, గృహ నిర్మాణ శాఖ మంత్రి జ‌మీర్ అహ్మ‌ద్ మ‌ర్యాద పూర్వ‌కంగా శ‌నివారం సీఎం రేవంత్ రెడ్డిని క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా వారిద్ద‌రి మ‌ధ్య కొంత సేపు సంభాష‌ణ చోటు చేసుకుంది. త్వ‌ర‌లో దేశ వ్యాప్తంగా పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి రావ‌డానికి క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీ ఇతోధికంగా స‌హాయం చేసింది. ప్ర‌ధానంగా ఆ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. చివ‌ర‌కు సీఎం ఎంపిక స‌మ‌యంలో కూడా ఆయ‌న హైద‌రాబాద్ లో మ‌కాం వేశారు.

మొత్తంగా త‌ను కోరుకున్న‌ట్లుగానే డీకే శివ‌కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి అన్ని వేళ‌లా అండ‌దండ‌లు అందించారు. ఇదే స‌మ‌యంలో అక్క‌డి నేత‌లు, మంత్రులంతా ఇక్క‌డ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ త‌న‌ను క‌లుసుకున్న సంద‌ర్బంగా ప్ర‌త్యేకంగా అభినందించారు జ‌మీర్ అహ్మ‌ద్ ను సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.

ఆయ‌న వృత్తి ప‌రంగా బిజీగా ఉన్న‌ప్ప‌టికీ క‌ర్ణాట‌క మంత్రితో భేటీ కావ‌డం వివిధ అంశాల‌పై చ‌ర్చించ‌డం ఆస‌క్తిని రేపింది.