NEWSNATIONAL

బెంగాల్ లో బీజేపీ హ‌వా

Share it with your family & friends

టైమ్స్ నౌ స‌ర్వేలో వెల్ల‌డి

ప‌శ్చిమ బెంగాల్ – తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోని షాకింగ్ త‌గ‌ల‌నుంది. త్వ‌ర‌లో రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో టీఎంసీకి ఆశించిన మేర సీట్లు రావ‌ని స‌ర్వేలు పేర్కొన‌డం విస్తు పోయేలా చేసింది. తాజాగా శ‌నివారం ప్ర‌ముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఈటీజీ ఒపీనియ‌న్ పోల్ ప్ర‌కారం ప‌శ్చిమ బెంగాల్ లో బీజేపీ నెంబ‌ర్ వ‌న్ పార్టీ అవుతుంద‌ని తేల్చింది.

ఒక‌వేళ ఇదే గ‌నుక జ‌రిగితే డేంజ‌ర్ బెల్స్ మోగిన‌ట్టేన‌ని టీఎంసీ పార్టీ చీఫ్ , సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ భావించాల్సి ఉంటుంది. 2024లో అత్యంత షాకింగ్ ఫలితం అవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. బెంగాల్ లో క‌మ‌లం జెండా ఎగర‌నుంద‌ని పేర్కొంది.

20 నుంచి 24 సీట్ల‌ను బీజేపీ 42 శాతం ఓట్ల‌తో చేజిక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇక 40 శాతం మేర 17 నుంచి 21 సీట్ల‌కు టీఎంసీ ప‌రిమితం కానుంద‌ని స‌ర్వే తేల్చింది. ఇదిలా ఉండ‌గా ఈసారి బీజేపీ మ‌రోసారి ముచ్చ‌ట‌గా మూడోసారి కేంద్రంలో ప‌వ‌ర్ లోకి వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని స‌ర్వే సంస్థ‌లు పేర్కొన్నాయి.

బీజేపీ ఊహించ‌ని రీతిలో పుంజుకుంటోంద‌ని హెచ్చ‌రించారు రాజ‌కీయ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్.