బీఆర్ఎస్ అభ్యర్థికి బీ ఫామ్
అందజేసిన మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ – రాష్ట్రంలో ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవికి పోటీ నెలకొంది. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం పోటీ నెలకొంది. ఇప్పటికే అధికారంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. తమ పార్టీ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కంపెనీకి చెందిన మన్నె జీవన్ రెడ్డిని స్థానిక సంస్థల అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం స్థానిక సంస్థలలో అత్యధికంగా మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన వారే ఉన్నారు. దీంతో ఆ పార్టీ తరపున ఇప్పటికే బీఆర్ఎస్ బాస్ నాగర్ కుంట నవన్ కుమార్ రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేశారు.
తాజాగా తన నివాసంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ కుమార్ రెడ్డికి బీ ఫామ్ అందజేశారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ , మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.