డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు ఖరారు
ఇండియా కూటమి సత్తా చాటుతుంది
తమిళనాడు – త్వరలో దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు కమల్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) సీఎం ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేకు మద్దతు ప్రకటించింది.
ఇదే సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సారథ్యంలోని బృందం తాజాగా సీఎం ఎంకే స్టాలిన్ ను కలుసుకుంది. వీరి మధ్య గంటకు పైగా చర్చలు జరిగాయి.
ఈ మేరకు కీలక ప్రకటన చేశారు కేసీఆర్ వేణుగోపాల్. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి రాష్ట్రాలలో డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. తాము కలిసి ముందుకు వెళతామని, ఇండియా కూటమి సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.
భారత కూటమి కనీసం 40 మంది ఎంపీలను లోక్ సభకు పంపేందుకు సిద్దంగా ఉందన్నారు. తమ కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం పక్కా అని పేర్కొన్నారు కేసీ వేణుగోపాల్.