19 నుంచి చంద్రబాబు టూర్
ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్
అమరావతి – ఏపీలో త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఎలాగైనా ఈసారి పవర్ లోకి రావాలని శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. ఢిల్లీలో చర్చలు ఫలప్రదం కావడంతో టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా అన్ని పార్టీల కంటే తనతో పాటు తనయుడు లోకేష్ బాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 19 నుండి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఈ విషయాన్ని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు వెల్లడించారు.
పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు 6 నియోజకవర్గాలలో ప్రజా గళం పేరుతో నిర్వహించే సభలలో పాల్గొంటారని పేర్కొన్నారు. 19న ఉదయం పి. గన్నవరంలో, సాయంత్రం రామచంద్రాపురంలో జరిగే సభలకు హాజరవుతారని తెలిపారు. 20న ఉదయం కొవ్వూరు, సాయంత్రం అనపర్తి సభలలో, 21న పత్తిపాడు, సాయంత్రం పెద్దాపురం ప్రజా గళం సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారని పేర్కొన్నారు.