వైసీపీ గూటికి ముద్రగడ
14న ముహూర్తం అన్న నేత
అమరావతి – ప్రముఖ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మనసు మార్చుకున్నారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. తాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ సీపీ లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. గత కొంత కాలంగా ముద్రగడ ఏ పార్టీ వైపు వెళతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి అత్యధిక జనాభా ఉంది. వీరే కీలకంగా మారనున్నారు. అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేయనున్నారు.
తొలుత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలోకి ముద్రగడ పద్మనాభం చేరనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఊహించని రీతిలో ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, తదితర సీనియర్ నాయకులు ముద్రగడతో చర్చలు జరిపారు. చివరకు జగన్ రెడ్డి పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగా ముద్రగడ పద్మనాభం సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఈనెల 14న జగన్ రెడ్డి సమక్షంలో వైసీపీలోకి చేరనున్నట్లు ప్రకటించారు. కాపు ఉద్యమ నాయకుడిగా, మాజీ మంత్రిగా పని చేశారు. ఆదివారం ఉదయం కిర్లంపూడి మండలం లోని ఆయన నివాసంలో ముద్రగడ మీడియాతో మాట్లాడారు.