ఆడ బిడ్డలకు హస్తం అభయం
పరామర్శించిన వైఎస్ షర్మిల
అమరావతి – రాష్ట్రంలోని పేద ఆడబిడ్డలకు ప్రతి నెల 5 వేల రూపాయలు ఇచ్చే ఉద్దేశంతో తీసుకొచ్చిన ‘ఇందిరమ్మ అభయం’ పథకం యాప్‌ను లాంఛ్ చేయడం జరిగిందని చెప్పారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.
ఈ సందర్భంగా అర్హులైన కొంత మంది మహిళల వివరాలు అందులో పొందు పర్చడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి మహిళ వివరాలు ఈ యాప్ ద్వారా సేకరిస్తామని పేర్కొన్నారు వైఎస్ షర్మిల. ఈ పథకం అమలు కావాంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. పేద కుటుంబాలకు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు.
ఆదివారం వైఎస్ షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని పేద మహిళలకు ఈ పథకం ఆసరాగా నిలుస్తుందని స్పష్టం చేశారు. దీని వల్ల వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు వల్ల ఏం సాధించాలని చూస్తున్నారంటూ ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా ఆ ఓటు భారతీయ జనతా పార్టీకి చేరుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు.