NEWSNATIONAL

ఒత్తిళ్లు త‌ట్టుకోలేక రాజీనామా

Share it with your family & friends

స్పందించిన కేసీ వేణుగోపాల్

న్యూఢిల్లీ – దేశంలో లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఈ త‌రుణంలో కీల‌క పాత్ర పోషించే కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈసీకి సంబంధించిన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ అరుణ్ గోయెల్ ఉన్న‌ట్టుండి బిగ్ షాక్ ఇచ్చారు. ఈ మేర‌కు తాను రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అరుణ్ గోయెల్ రిజైన్ చేయ‌డంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ మేర‌కు ఆదివారం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంలో రాజ్యాంగాన్ని ర‌క్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తోంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.

అరుణ్ గోయెల్ రాజీనామా చేయ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని పేర్కొన్నారు . ఈసీఐ వంటి రాజ్యాంగ బ‌ద్ద‌మైన సంస్థ ఎలా ప‌ని చేస్తుంద‌నే దానిపై మ‌రోసారి అనుమానం క‌లుగుతోంద‌ని తెలిపారు కేసీ వేణుగోపాల్.

2019 ఎన్నికల సమయంలో, మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి నందుకు ప్రధానికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని అశోక్ లావాసా వ్యతిరేకించిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఎడ‌తెగ‌ని విచార‌ణ‌ను ఎదుర్కొన్నార‌ని తెలిపారు .

ప్రజాస్వామ్య సంప్రదాయాలను ధ్వంసం చేసేందుకు మోదీ పాల‌న ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు కేసీ వేణుగోపాల్.