ఎన్నికల కమిషనర్ రాజీనామా
తప్పుకున్న అరుణ్ గోయెల్
న్యూఢిల్లీ – త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉన్నట్టుండి కోలుకోలేని షాక్ ఇచ్చారు కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్. 2024 ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఆయన తప్పు కోవడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ముగ్గురు సభ్యులతో కూడిన భారత ఎన్నికల సంఘం ఇప్పటికే ఖాళీగా ఉంది. అరుణ్ తప్పు కోవడంతో కేవలం ఒకే ఒక్కరు ఎన్నికల కమిషనర్ గా రాజీవ్ కుమార్ మాత్రమే ఉన్నారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
అయితే అరుణ్ గోయెల్ తాను వ్యక్తిగత కారణాల రీత్యా తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అనారోగ్యం కారణంగా తప్పుకుంటున్నట్లు మరికొందరు పేర్కొంటున్నా ఆయన సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం.
అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు అరుణ్ గోయెల్ కు మధ్య ఓ ఫైల్ పై సంతకం చేసే విషయంలో విభేదాలు పొడ చూపాయని ,అందుకే ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారని సమాచారం.
ఇదిలా ఉండగా పంజాబ్ క్యాడర్ కు చెందిన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నవంబర్ 2022లో ఎన్నికల కమిషనర్ గా చేరారు. గోయెల్ తప్పుకోవడంతో ఒకే కమిషనర్ తో దేశంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే.