గెలుపు తథ్యం మాదే అధికారం
బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి
అమరావతి – ఏపీ భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి సంచలన కామెంట్స్ చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అవినీతి రహిత పాలన అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం, జనసేన పార్టీలతో భారతీయ జనతా పార్టీ పొత్తు కుదుర్చుకుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది బీజేపీకి ముఖ్యమన్నారు. ఆంధ్రాకు ఈ లక్ష్యాన్ని అందించేందుకు ఈ మూడు పార్టీలు పని చేస్తాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ కూటమిని ఆశీర్వదిస్తారని నమ్మకం ఉందన్నారు దగ్గుబాటి పురందేశ్వరి.
అసెంబ్లీ పరంగా 175 స్థానాలు, లోక్ సభ పరంగా 25 ఎంపీ సీట్లకు గాను భారీ ఎత్తున సీట్లు కైవసం చేసుకుంటామని ఏపీ బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు. తాము గెలవడం తథ్యమని, అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.