NEWSTELANGANA

మాదిగ స‌మ్మేళ‌నం పోస్ట‌ర్ రిలీజ్

Share it with your family & friends

పిడ‌మ‌ర్తి ర‌వికి మంత్రి అభినంద‌న

హైద‌రాబాద్ – 12 శాతం మాదిగ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ డాక్ట‌ర్ పిడ‌మ‌ర్తి ర‌వి ఆధ్వ‌ర్యంలో మాదిగ స‌మ్మేళ‌నం చేప‌ట్ట‌నున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించారు.

పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి లో డా. పిడమర్తి రవి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రం లో మాదిగ సమ్మేళనం ప్రారంభం కానుంది.

ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ సంఘాల సమైక్య, నేషనల్ దళిత సంక్షేమ సంఘం, దళిత సంక్షేమ సంఘం, మాదిగ రాజకీయ వేదిక, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం, మహా ఎంఆర్పిఎస్, తెలంగాణ దళిత బహుజన సమితి, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి, తెలంగాణ దళిత దండు, మాదిగ శక్తి, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్, మాదిగ జేఏసీల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.

సంగారెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం స్థాయి మాదిగ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు డా. పిడమర్తి రవిని మంత్రి దామోదర రాజనరసింహా అభినందించారు.